హైదరాబాద్‌లో ఎండలు మండిపోతున్నాయ్!

గ్రేటర్‌లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి పొగమంచు కురుస్తున్నప్పటికీ 8 తర్వాత నుంచి ఎండవేడి ప్రారంభమవుతోంది. నాలుగు రోజులుగా సాధారణ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల కంటే నాలుగైదు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. గురువారం 34.4 డిగ్రీలు, శుక్రవారం 36.0, శనివారం 35.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఖైరతాబాద్‌లో అత్యధికంగా 36.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 

పెరిగిన విద్యుత్‌ వినియోగం

గ్రేటర్‌లో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్న నేపథ్యంలో విద్యుత్‌ వినియోగం భారీగా పెరుగుతోంది. నాలుగురోజుల కిత్రం వరకు 45-46 మిలియన్‌ యూనిట్లుగా నమోదైన వినియోగం శుక్రవారం (26వ తేదీ) 49 యూనిట్లకు చేరుకుంది. మార్చిలో 60 మిలియన్‌ యూనిట్ల వరకు నమోదయ్యే అవకాశాలున్నాయని ఆపరేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో విద్యుత్‌ డిమాండ్‌ 70 మిలియన్‌ యూనిట్లకు చేరినా ఎలాంటి అంతరాయాలు లేకుండా సరఫరా అందించేలా చర్యలు తీసుకున్నట్లు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ ఆపరేషన్‌ డైరెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top