మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని రామచరణ్ స్వయంగా ప్రకటించాడు. ‘కరోనా టెస్ట్ చేయించుకోగా వైద్యులు పాజిటివ్ అని ధృవీకరించారు. ఎలాంటి లక్షణాలైతే లేవు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాను. త్వరలోనే ఆరోగ్యంగా.. మరింత స్ట్రాంగ్‌గా తిరిగి వస్తాను’ అంటూ రామ్ చరణ్ ఒక ప్రకటన విడుదల చేశాడు