సమాచారం తప్పుగా ఉందని.. ట్రంప్ వీడియోను తొలగించిన ఫేస్‌బుక్, ట్విటర్

వాషింగ్టన్: కరోనా మహమ్మారికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు పోస్ట్ చేసిన వీడియోను తొలగించినట్టు ట్విటర్ మంగళవారం వెల్లడించింది. ట్రంప్ పోస్ట్ చేసిన వీడియోలో సమాచారం తప్పుగా ఉండటంతోనే వీడియోను తొలగించినట్టు సంస్థ పేర్కొంది. మరోపక్క ఇదే వీడియోను ఫేస్‌బుక్ సోమవారం సాయంత్రమే తొలగించింది. ట్రంప్ పోస్ట్ చేసిన వీడియోలో.. కరోనాను నియంత్రించాలంటే ఫేస్‌మాస్క్‌లు, లాక్‌డౌన్‌లు అవసరం లేదని వైద్యులు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కరోనాకు మందుగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను కూడా ఉపయోగించవచ్చని తెలిపారు. ఇప్పటికే ఈ డ్రగ్‌ను వాడొద్దంటూ పలు అధ్యయనాలు వెల్లడించాయి. కాగా.. ఈ వీడియోను ట్రంప్ మొదట ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా.. 1.4 కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. ఇక ఫేస్‌బుక్ సమాచారం తప్పుగా ఉందంటూ వీడియోను తొలగించడంతో.. వెంటనే ట్రంప్ ఇదే వీడియోకు సంబంధించిన అనేక క్లిప్పింగ్‌లను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ట్రంప్‌కు ట్విటర్‌లో 8.4 కోట్ల మంది ఫాలోవర్లు, ఫేస్‌బుక్‌లో 2.8 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్రంప్ పెట్టిన పోస్ట్‌లు తమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని గతంలోనూ ట్రంప్ ట్వీట్లను ట్విటర్ సంస్థ తొలగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top