వైఎస్సార్ అసలైన కాంగ్రెస్ వాది: తులసిరెడ్డి

విజయవాడ: వైఎస్సార్ అసలైన కాంగ్రెస్ వాదని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తెలిపారు. వైఎస్ చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉన్నారని, కేవలం అధికారం కోసమే సీఎం జగన్ వైఎస్సార్ పేరు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రూ.8 వేల కోట్ల రుణమాఫీ ఎగ్గొట్టి జగన్ రైతులను మోసం చేశారని దుయ్యబట్టారు. వైసీపీ వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించిందని, ఉచిత విద్యుత్ సరఫరా ఎగ్గొట్టాలని చూస్తే రైతులు ఊరుకోరని హెచ్చరించారు. వైఎస్సార్ వర్ధంతి రోజున రైతులకు జగన్ ఇచ్చే కానుక ఇదేనా? అని తులసిరెడ్డి ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top