వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేతల చేరికల వెల్లువ

వెంకటగిరి నియోజకవర్గంలో జెడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులు

విశాఖలో ఏడుగురు ఎంపీటీసీ అభ్యర్థులు

గుంటూరు జిల్లాలోనూ భారీ షాక్‌ 

నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరిలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ అభ్యర్థులు సైతం ఉండటం గమనార్హం. పరిషత్‌ ఎన్నికలను బహిష్కరించామన్న చంద్రబాబు పలాయన వాదంతో విభేదించి, మరోవైపు వైఎస్‌ జగన్‌ పాలనను మెచ్చి పార్టీ మారారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండల టీడీపీ ఎంపీపీ అభ్యర్థి రాయి రమేష్‌చౌదరి, జెడ్పీటీసీ అభ్యర్థి రాయి దేవికాచౌదరి దంపతులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.  డిప్యూటీ సీఎం నారాయణస్వామి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి,  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ నాయుడు, తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి సమక్షంలో చేరికలు జరిగాయి.

విశాఖలో వరుస షాక్‌లు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీని ఒక్కొక్కరిగా వీడుతున్నారు. ఆనందపురం మండలం కుసులవాడకు చెందిన టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి షిణగం శారద మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో వెఎస్సార్‌సీపీలో చేరారు. మునగపాక మండలం పాటిపల్లి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి జయలక్ష్మి నాగేశ్వరరావు యలమంచిలి ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు సమక్షంలో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కె.కోటపాడు మండలం కింతాడ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి బండారు అమ్మాజీ ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు కుమార్తె అనురా>ధ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం–1, 2 ఎంపీటీసీ స్థానాల టీడీపీ అభ్యర్థులు సూరాడ ఎర్రయ్య, మైలపల్లి ధనలక్ష్మి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. రావికమతం మండలంలోని పి.పొన్నవోలు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి కొశిరెడ్డి రమణమ్మ, చోడవరం మండలం లక్కవరం–2 టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి మాధవి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సమక్షంలో వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.

గుంటూరు జిల్లాలో చావుదెబ్బ
గుంటూరు జిల్లా గొట్టిపాడులో టీడీíపీకి చావుదెబ్బ తగిలింది. టీడీపీ నేత, నాగార్జునసాగర్‌ కుడి కాలువ ప్రాజెక్ట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ గుంటుపల్లి వీరభుజంగరాయలు, టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మరికొందరు సోమవారం రాత్రి వైఎస్సార్‌సీపీలో చేరారు. అనంతరం వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి విప్పాల కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్‌ గుంటుపల్లి బాబూరావు, ఎంపీటీసీ అభ్యర్థులతో కలిసి ప్రచారం ప్రారంభించారు. 

► క్రోసూరు మాజీ జెడ్పీటీసీ , టీడీపీ నేత చిలకా విల్సన్‌ గ్లోరి పెదబాబు తన అనుచర వర్గంతో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనతోపాటు అచ్చంపేట మాజీ ఎంపీపీ గుడేటి అరుణ్‌కుమార్, అడ్వొకేట్‌ మేదర అనిల్‌కుమార్, మాజీ సర్పంచ్‌ గుడేటి మందయ్య, మరియదాసు, వేమవరపు ఏసోబు మరో 50 మందికి పైగా టీడీపీ కార్యకర్తలకు ఎమ్మెల్యే శంకరరావు కండువాలు కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు.  
► నాదెండ్ల మండలం తూబాడు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గోళ్లమూడి బాలస్వామి తన వర్గీయులతో కలిసి సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్ర«హ్మానందరెడ్డి సమక్షంలో సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top