కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. మీడియా ముందుకొస్తే చాలు సంచలన వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అటు తెలంగాణ రాజకీయాల్లో.. ఇటు సొంత పార్టీలో హాట్ టాపిక్ అవుతున్నారు. పీసీసీ పదవి ఎంపీ రేవంత్ రెడ్డికి ఇస్తున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలపై వీహెచ్ స్పందిస్తూ ఏ రేంజ్లో ఊగిపోయారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అంతేకాదు రేవంత్ అభిమానులు సైతం వీహెచ్‌కు ఫోన్ చేసి మరీ తిట్ల దండకం అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో టేపులు ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ వ్యవహారం ముగియక మునుపే ఈసారి ఏకంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.