వారిని దూరం చేసుకోవడం బాధాకరం: నాదెండ్ల మనోహర్

అమరావతి: చిత్తూరు జిల్లా కదిరి ఓబనపల్లె క్రాసు దగ్గర దుర్ఘటనలో జనసేన కుటుంబం ముగ్గురు సభ్యులను దూరం చేసుకోవడం అత్యంత బాధాకరమని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీ పెడుతుంటే విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు దుర్మరణం పాలయ్యారని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయని పేర్కొన్నారు.  మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాదం నుంచి కోలుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలన్నారు. ఆ జనసైనికుల కుటుంబాల గురించే పవన్ కళ్యాణ్  ఆలోచిస్తూ ఆవేదన చెందుతున్నారన్నారు. ఆ ముగ్గురి కుటుంబాలకు జనసేన నేతలు అన్ని విధాలా అండగా నిలవాలన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top