లద్దాఖ్‌లో భారీగా చైనా వైమానిక దళాలు

జాగ్రత్తలు తీసుకున్నాం: ఐఏఎఫ్‌ చీఫ్‌ భడౌరియా

లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చైనా భారీగా వైమానిక దళాలను మోహరించిందని వాయుసేన చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ భడౌరియా మంగళవారం వెల్లడించారు. ఇక్కడ జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వివరాలు తెలిపారు. ‘‘అయితే.. అందుకు దీటుగా మనం అన్ని జాగ్రత్తల్ని తీసుకున్నాం. పరిస్థితిని ఎలా హ్యాండిల్‌ చేయాలన్నదానిపై స్పష్టతతో ఉన్నాం’’ అని భౌడౌరియా పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top