లక్ష కోట్ల ‘సౌర’ కుంభకోణం

సౌర విద్యుత్‌ టెండర్ల వెనుక రూ.లక్ష కోట్ల కుంభకోణం దాగి ఉందని టీడీపీ ఆరోపించింది. జగన్‌ ప్రభుత్వం పిలిచిన సౌర విద్యుత్‌ టెండర్ల వల్ల ఆ కంపెనీలకు 30 ఏళ్లలో రూ.లక్షా 20వేల కోట్లు చెల్లించాల్సి వ స్తోందని, తన బినామీలకు వాటిని కట్టబెట్టి ఆ డ బ్బు దోచుకోవడానికి సీఎం పథక రచన చేశారని ఆ పార్టీ ధ్వజమెత్తింది. మంగళవారం టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం మాట్లాడుతూ.. ‘ఆరున్నర వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తికి  ప్రభుత్వం టెండర్లు పిలిచింది. టెండర్లు పొందిన కంపెనీలు మరో 50ు ఉత్పత్తిని అదే ధరకు పెం చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఈ విద్యుత్‌ను ప్రభుత్వమే కొంటుంది. సరాసరిన ఒక యూ నిట్‌ విద్యుత్‌ రూ.2.50 వేసుకొన్నా 30ఏళ్లలో ఈ కంపెనీలకు రూ.1.20 లక్షల కోట్లు చెల్లించాలి. రా ష్ట్రం విద్యుత్‌ లోటులో ఉందంటే అర్థం చేసుకోవ చ్చు.

మన రాష్ట్రం 5వేల మిలియన్‌ యూనిట్ల మిగులులో ఉందని కేంద్రం అధికారికంగా వెల్లడించింది. ఇంత మిగులులో ఉంటే మళ్లీ కొత్తగా సౌర విద్యుత్‌ ఎందుకు? ఎవరి జేబులు నింపడానికి ఈ వ్యవహారం నడిపిస్తున్నారు?’ అని ఆయన ప్రశ్నించారు. జగన్‌రెడ్డి బినామీలకే ఈ టెండర్లు దక్కాయని ఆరోపించారు. ‘సీఎంకి కావాల్సిన వారు తప్ప మరెవరూ టెండర్లు వేయలేదు. ఎక్కువ టెండర్లు వేసిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థకు ఇంతకు ముందు సౌర విద్యుత్‌లో అనుభవం లేదు. దీని యజమాని నర్రెడ్డి విశ్వేశ్వర రెడ్డి జగన్‌ బంధువైన కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి బినామీ. జగన్‌ బినామీలకు ఈ టెండ ర్లు కట్టబెట్టబోతున్నారనడానికి ఇదే నిదర్శనం. దొడ్డిదారిన ఈ కంపెనీ ద్వారా జగన్‌ తన ఖజానా నింపుకొంటున్నారు’ అని విమర్శించారు. ‘టెక్నాలజీ లో మార్పుల వల్ల విద్యుత్‌ ధరలు తగ్గుతూ పోతాయని, బుద్ధీ, జ్ఞానం ఉన్నవాడెవడూ పాతికేళ్లకు పీపీఏలు కుదుర్చుకోరని గతేడాది జూలైలో అసెంబ్లీలో జగన్‌ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ బుద్ధీ జ్ఞానం ఎటు పోయాయి? మోకాల్లోకి జారాయా? అని పట్టాభి ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top