రిలయన్స్‌ నెం.2 ప్రపంచంలో రెండో అతిపెద్ద ఇంధన సంస్థగా అవతరణ

రూ.14.5 లక్షల కోట్లకు కంపెనీ మార్కెట్‌ విలువ 

బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాప్‌లో 10% వాటాకు సమానం 

న్యూఢిల్లీ: అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) మరో రికార్డును సొంతం చేసుకుంది. మార్కెట్‌ విలువ పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఇంధన సంస్థగా అవతరించింది. తాజాగా ఈ జాబితాలో ఎక్సాన్‌మొబిల్‌ను వెనక్కి నెట్టి, వరల్డ్‌ నెం.1 ఆయిల్‌ కంపెనీ సౌదీ అరామ్కో తర్వాత స్థానాన్ని ఆక్రమించింది. రిలయన్స్‌ షేర్లలో రికార్డు ర్యాలీ ఇందుకు దోహదపడింది. గుజారాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్‌ మెగా ఆయిల్‌ రిఫైనరీ కాంప్లెక్స్‌ను నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ యూనిట్‌ ఇది. గత వారాంతపు ట్రేడింగ్‌లో రిలయన్స్‌ మార్కెట్‌ విలువ మరో 800 కోట్ల డాలర్లు పెరిగి మొత్తం 18,900 కోట్ల డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో ఎక్సాన్‌మొబిల్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 100 కోట్ల డాలర్ల మేర క్షీణించడంతో ర్యాంకింగ్స్‌లో మెట్టు కిందికి దిగింది. ఇక సౌదీ అరామ్కో విషయానికొస్తే.. 1.76 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆయిల్‌ కంపెనీగా కొనసాగుతోంది.

ఈ ఏడాదిలో 50ు పెరిగిన ఆర్‌ఐఎల్‌ విలువ  

సోమవారం బీఎ్‌సఈ ట్రేడింగ్‌లో రిలయన్స్‌ షేరు ధర రూ.2,198.70 వద్ద సరికొత్త ఆల్‌టైం రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. చివరికి 0.45 శాతం లాభంతో రూ.2,155.85 వద్ద స్థిరపడింది. దాంతో కంపెనీ మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (ఫుల్లీ పెయిడ్‌తోపాటు పార్ట్‌లీ పెయిడ్‌ షేర్లు కలిపి) రూ.14.38 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ విలువ బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీలన్నింటి మార్కెట్‌ విలువ (రూ.147.23 లక్షల కోట్లు)లో 9.8 శాతానికి సమానం. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిలయన్స్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 49.8 శాతం (రూ.4.77 లక్షల కోట్లు) పెరిగింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top