మౌంట్‌ రోడ్డులో వెక్కి వెక్కి ఏడ్చింది

తమిళ చిత్రం ‘మదరాసుపట్టణం’తో బ్రిటీష్‌ మోడల్‌ అమీ జాక్సన్‌ భారతీయ తెరకు పరిచయమయ్యారు. చెన్నైలో ఆ సినిమా చిత్రీకరణ చేస్తున్న సమయంలో ఆమె వెక్కి వెక్కి ఏడవడంతో భయపడ్డానని ఏఎల్‌ విజయ్‌ చెప్పుకొచ్చారు. పదేళ్ల క్రితం నాటి సంగతులను ఇటీవల చిత్రదర్శకుడు గుర్తు చేసుకున్నారు. ‘‘మౌంట్‌ రోడ్డులో చిత్రీకరణ చేస్తున్నాం. వాతావరణం వేడిగా ఉంది. టెంపరేచర్‌ 40 డిగ్రీలు ఉంటుందనుకుంట. సడన్‌గా బండి దిగిన అమీ, కొంత దూరం పరిగెత్తుకుని వెళ్లి ఏడవడం మొదలుపెట్టింది. ఏమైందని ఆరా తీయగా ‘ఎండలో ఆ గుర్రం అంత కష్టపడటం నేను చూడలేను. దాన్ని దత్తత తీసుకుంటా’ అని అమీ చెప్పింది. జట్కా సన్నివేశాల కోసం మేం ఆ గుర్రాన్ని తెప్పించాం. దానికి మరింత తిండి పెట్టేవరకూ అమీ శాంతించలేదు’’ అని విజయ్‌ పేర్కొన్నారు. తెలుగులో ‘1947 ఎ లవ్‌స్టోరీ’గా ఆ సినిమా విడుదలైంది. తర్వాత రామ్‌చరణ్‌ ‘ఎవడు’లో అమీ జాక్సన్‌ నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top