మా ప్రభుత్వంలో ఇలానే చేసి వుంటే..: చంద్రబాబు

అమరావతి: కోవిడ్ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కేవలం లెటర్‌ ఇచ్చారనే ఆరోపణలతో అచ్చెన్నాయుడిని అన్యాయంగా అరెస్ట్‌ చేశారన్నారు. ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని 600 కి.మీ ప్రయాణం చేయడం వల్లే మళ్లీ ఆపరేషన్‌ చేయాల్సి వచ్చిందన్నారు. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ఈ ఘటనలే నిదర్శనమని పేర్కొన్నారు. పోలీసులు కూడా డబ్బులు తీసుకోలేదని చెప్పారని గుర్తుచేశారు. కోర్టు కూడా సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యానించిందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నందునే అచ్చెన్నాయుడు నోరు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top