మంత్రి కేటీఆర్‌ను కలిసిన ముస్లిం మత పెద్దలు

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నివారణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పూర్తిగా సహకరిస్తామని ముస్లిం మతపెద్దలు తెలిపారు. సోమవారం జీహెచ్‌ఎంసి కార్యాలయంలో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే ముస్లిం మత పెద్దలు మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు వచ్చారు. మంత్రి కేటీఆర్‌ను కలిసిన వారిలో ముస్లిం మత పెద్దలు ఖుబుల్‌పాషా సత్తారి, ముఫ్తీ ఖలీల్‌అహ్మద్‌, మహ్మద్‌పాషా, ఇఫ్తెకారి పాషా తదితరులు ఉన్నారు. ఈసందర్భంగా వారుమాట్లాడుతూ రంజాన్‌ మాసం సందర్భంగా సామాజిక దూరాన్ని పాటి ంచేందుకు తమ ఇళ్ల వద్దనే అన్ని ప్రార్ధనలు నిర్వహించాలని ముస్లింలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు వివరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఈ మహమ్మారి నుంచి బయట పడడమే ముందున్న లక్ష్యమని అన్నారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్‌ వివిధ జిల్లాల ఉన్నతాధికారులతో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల పై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌బాబాఫసియుద్దీన్‌ తదతరులు ఉన్నారు  .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top