బ్యాంకులు సవాళ్లకిసిద్ధం కావాలి : ఆర్‌బీఐ

కరోనా కారణంగా విధించిన ఆంక్షల ఎత్తివేత అనంతరం బ్యాంకులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనాల్సివస్తుందని హెచ్చరిస్తూ రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు, వాటికి దీటుగా తమను తాము సద్దుబాటు చేసుకునేందుకు అవి సిద్ధం కావాలని ఆర్‌బీఐ సూచించింది. ‘‘2019-20లో భారతదేశంలో బ్యాంకింగ్‌ ధోరణులు, పురోగతి’’ అనే అంశంపై ఆర్‌బీఐ ఒక నివేదిక విడుదల చేసింది.

కరోనా ప్రభావంతో తలకిందులైన పద్దుల కారణంగా ఎదురైన గడ్డుస్థితి నుంచి బ్యాంకు లు, కార్పొరేట్లు, గృహస్థులను కాపాడేందుకు కీలక వడ్డీరేట్ల తగ్గింపు, అదనపు లిక్విడిటీ అందించడం, నియంత్రణాపరమైన సంయమనం వంటి పలు చర్యలు చేపట్టినట్టు తెలిపింది. బ్యాంకుల స్వస్థత సూచీలు ఆస్తుల నాణ్యతలో ఏర్పడిన సందిగ్ధతల కారుమేఘాల్లో మరుగునపడిపోయినట్టు పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ తీరుతెన్నుల మీదనే రాబోయే కాలంలో బ్యాంకుల స్వస్థత ఆధారపడుతుందని తెలిపింది.   

ఎన్‌బీఎ్‌ఫసీల లాభాల్లో క్షీణత:

రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితితో పాటు రుణాలకు తగ్గిన డిమాండు కారణంగా ఎన్‌బీఎ్‌ఫసీల లాభదాయకత ప్రభావం అవుతుందని ఆ నివేదిక తెలిపింది. ఎన్‌బీఎ్‌ఫసీల్లో మారటోరియంను ఉపయోగించుకున్న కస్టమర్ల శాతం తక్కువగానే ఉన్నప్పటికీ మారటోరియం అనంతరం వసూలు కావలసిన రుణపరిమాణం మాత్రం షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల కన్నా అధికంగా ఉన్నట్టు పేర్కొంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top