బాలీవుడ్‌కి టాలీవుడ్‌కి తేడా చెప్పిన నిధి అగర్వాల్

ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ నటి అయిపోయిన నిధి అగర్వాల్.. ఆ తర్వాత మంచి మంచి ఆఫర్స్ పట్టేస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడామె చేతిలో టాలీవుడ్‌లో ఒక్క గల్లా అశోక్ పరిచయ చిత్రం తప్ప వేరే చిత్రం లేదు. కానీ ఆమె మాత్రం బిజీ హీరోయిన్ అవుతానని చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తుంటుంది. ప్రస్తుతం కరోనా కారణంగా ముంబై నుంచి తన సొంత ప్రాంతం అయిన బెంగళూర్‌లో అమ్మనాన్నలతో కలిసి ఉంటున్న ఈ భామకు బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయట. త్వరలోనే బాలీవుడ్‌లో బిజీ అవుతానని అంటుంది. ఆమె తన తాజా ఇంటర్వ్యూలో బాలీవుడ్‌కు, టాలీవుడ్‌కు గల తేడాని వివరించింది.

ఆమె మాట్లాడుతూ.. ‘‘బాలీవుడ్‌కు, టాలీవుడ్‌కు ఉన్న తేడా ఏమిటంటే.. బాలీవుడ్ సెట్స్‌లో పోహా టిఫిన్‌గా పెడితే.. టాలీవుడ్ సెట్స్‌లో ఇడ్లీ, దోశ పెడతారు. అంతే.. అంతకు మించి ఎటువంటి తేడా లేదు..’’ అని తెలిపింది. ఇంకా టాలీవుడ్‌లో తనకు పవన్ కల్యాణ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన నిధి.. హీరోయిన్లలో కాజల్, సమంత, నయనతారలంటే ఇష్టమని తెలిపింది. తన దృష్టిలో ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్ హృతిక్ రోషన్ మాత్రమేనని కూడా నిధి తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top