బలమైన కారణం లేకుండా రూ.12.5 కోట్లు ఎవరూ వదులుకోరు: సురేష్ రైనా

ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడాల్సిన సురేష్ రైనా వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి వైదొలగడంపై రకరకాల ఊహాగానాలు తెరపైకొచ్చాయి. యూఏఈలో కల్పించిన సదుపాయాలు నచ్చక రైనా తిరిగొచ్చాడని కొందరు, చెన్నై టీం తరపున రైనా ఇక ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో.. తాను ఈ ఐపీఎల్ ఆడకపోవడంపై స్పష్టతనిచ్చిన సురేష్ రైనా ఊహాగానాలకు తెరదించాడు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని, తన కుటుంబం కోసం తాను తిరిగొచ్చానని రైనా చెప్పాడు. ఇతరత్రా కారణం ఏదైనా ఉన్నట్టయితే తాను ఇంటికి రాగానే చెప్పి ఉండే వాడినని రైనా తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top