పాకిస్థాన్‌కు పాకిన కొత్త కరోనా.. మొదటి కేసు నమోదు

ఇస్లామాబాద్: ఒకపక్క కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతూనే ఉంటే.. మరోపక్క కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచంపై దండయాత్ర ప్రారంభించింది. బ్రిటన్ నుంచి ప్రపంచదేశాలకు ఈ కొత్త స్ట్రెయిన్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా కరోనా కొత్త స్ట్రెయిన్ పాకిస్థాన్‌‌కు కూడా పాకింది. మంగళవారం పాకిస్థాన్‌లో కొత్త కరోనా కేసు బయటపడింది. బ్రిటన్ నుంచి సింధ్‌కు వచ్చిన 12 మంది ప్యాసింజర్లకు పరీక్షలు నిర్వహించగా.. వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. మూడు సాంపిల్స్‌ కొత్త కరోనాతో 95 శాతం మ్యాచ్ అయినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీరిని కాంటాక్ట్ అయిన వారందరిని ట్రేసింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా.. పాకిస్థాన్ ప్రభుత్వం యూకే విమానాలపై జనవరి 4 వరకు నిషేధం విధించింది. పాకిస్థాన్‌లో ఇప్పటివరకు మొత్తం 4,75,085 కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి మొత్తం 9,992 మంది మృత్యువాతపడ్డారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top