పర్యాటక కేంద్రంగా ‘వంగర’ను తీర్చిదిద్దుతాం- శ్రీనివాస్‌గౌడ్‌

వంగర: దేశం గర్వించదగ్గ వంగరను గొప్ప చారిత్రక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కావాల్సిన ప్రణాళికలు తయారు చేయనున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భావితరాల వారు గుర్తుంచుకునే విధంగా దేశంలో ఆదర్శంగా నిలిచేందుకు పీవీ సొంత గ్రామం వంగరను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తేవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పమని అన్నారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకు తాను టూరిజం, సాంస్కృతికశాఖ కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, ఎండి మనోహర్‌, సాంస్కృతికశాఖ డైరెక్టర్‌మామిడి హరికృష్ణ తదితరులతో వంగరను సందర్శించి పర్యాటక కేంద్రానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లపై పీవి బంధువలుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top