నర్సరీ ,పూర్వ ప్రాథమిక పాఠశాల ఐరిస్ ఫ్లోరెట్స్ అమీర్ పేట్- వినూత్న ప్రయోగం – శ్రీమతి విజిత మాతుర్

పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దడానికి ,నర్సరీ , పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యా దశనుండే వినూత్న ప్రయోగాత్మక భోధన పద్దతులతో, పిల్లల మనస్సులను హత్తుకొని, వారు నేర్చుకునే అంశంగురించి పిల్లల్లో ఆసక్తిని కలుగజేసి విషయంపట్ల స్వయంగా అవగాహన పెంపొందిచుకునేట్లు చెయ్యడం,
ఆట పాటలు, లలితకళలు, చిత్రలేఖనం మొదలైన వివిధ అంశాల పట్ల పిల్లలలో దాగిన నైపుణ్యత మరియు సృజనత్మకతలను గుర్తించి వారిని ఆసక్తికలిగిన విషయాలలో మరింత శిక్షణనిచ్చి నిష్ణాతులుగా తీర్చిదిద్దడం, ఆరోగ్యకర జీవన ప్రమాణాలు చిన్నప్పటినుండే వంటపడ్డడం కోసం యోగా లో శిక్షణ కల్పించడం, ప్రమాదకరమైన పరిస్థితుల్లో పిల్లల ఆత్మరక్షణ కొరకై ప్రతి విద్యార్థికి కరేటే, కుంగ్ ఫూ వంటి మార్షల్ ఆర్ట్స్ లో తర్ఫీదు, ఒకటవ తరగతి నుండే పిల్లలు నలుగురిలో ధైర్యంగా మాట్లాడేట్లు వారికి ఆంగ్లంలో డిబేట్లు, క్విజ్, చిన్న చిన్న స్కిట్స్, డ్రామాలు మొదలైనవి చేపించడం, పాట్యాంశాలు ప్రయోగాత్మకగా నేర్చుకునేట్టు అందుకు అనుగుణంగా అవసరమైతే పిల్లలకు సంబందిత ఫీల్డ్ విజిట్స్ అవకాశం కల్పించి చూసి నేర్చుకునే పద్దతి తద్వారా నేర్చుకున్న విషయం పిల్లల మదిలో శాశ్వతంగా గుర్తుండిపోవడం, పిల్లలలో దేశభక్తి, వివిధ మతాలపట్ల సౌభ్రాతృత్వం పెంపొందిచడం కోసం అన్ని జాతీయ దినోత్సవాలను,అన్ని మతాల పండుగలను పిల్లలచే వేషాధారణ చేయించి వారిచే చేపించడం, సంస్కృత శ్లోకాలు నేర్పడం, భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే అనేక విషయాలు, సంప్రదాయాలు పిల్లలకు నేర్పించడం వంటి ఎన్నో విషయాలను భోదిస్తూ భాగ్యనగరం అమీర్ పెట్ లో గల బ్రాంచ్
ఐరిస్ ఫ్లోరెట్స్ అమీర్పెట్ ప్రాధమిక పాటశాలలో తన ప్రత్యేకతను చాటుకుంది. పిల్లల తల్లిదండ్రులతో మరియు వారి తాత నాయనమ్మలు లేదా తాత అమ్మమ్మలతో టీచర్స్-పేరెంట్స్ మీటింగ్లు నిర్వహించి పిల్లల పుతోగతి గురించి వారికి ఎప్పటికప్పుడు తెలియపర్చడం కుడా
ఐరిస్ ఫ్లోరెట్స్ అమీర్పెట్ బ్రాంచ్
స్కూల్ నిర్వాహకులు చేస్తున్నారు. ఇలాంటి వినూత్న ప్రాధమిక విద్యను అందిస్తున్న ఈ పాటశాల నిర్వాహకురాలు శ్రీమతి విజిత మాతుర్ గారి పూర్వనేపధ్యం చూస్తే, వారు ప్రాధమిక విద్యను,కాన్వెంట్ లోను,ఉస్మానియా విశ్వవిద్వాలయం , వేంకటేశ్వర కళాశాల నుండి
బి-ఫార్మస డిగ్రీ పూర్తి చేసి, పట్టా, పొందారు. తండ్రి గారు పారిశ్రామికవేత్త అవడం ద్వారా, ఆర్థికంగా ఉన్న కుటుంబంలో జన్మించడం ఉన్నత విద్యావంతురాలు అయినప్పటికీ, నేటితరం పిల్లలను భావితరాల ఉన్నత పౌరులుగా తీర్చి దిద్దడానికి తను ఎంచుకున్న మార్గం ప్రాథమిక విద్యా రంగం, విద్యా రంగంలో తనకు గల అపార అనుభవంతో, ఈ పోటి ప్రపంచంలో పిల్లలు నిలదోక్కుకోవాలన్న, ఉన్నత చదువుల్లో సక్రమంగా రాణించాలన్న, వారిలోని శక్తి సామర్ధ్యాలు చిన్నప్పటి నుండే గుర్తించి, ప్రతి అంశంలో ప్రయోగాత్మక భోధన పద్దతులు అవసరమని ధృడంగా నమ్మిన విజిత మతూర్ గారు అందుకు అనుగుణంగా పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాలని అమీర్ పేట్ లో ఐరిస్ ఫ్లోరెట్స్
స్కూలును ఫ్రాంచ్ స్ తీసుకొని
దిగ్విజయంగా నడుపుతున్నారు. తన నూతన భోధన పద్దతులతో పిల్లలను సర్వతోముఖంగా తీర్చి దిద్దాలని అనేక ఆదర్శాలతో నర్సరీ , పూర్వ ప్రాథమిక పాఠశాలను నిర్వహిస్తున్న శ్రీమతి విజిత మాతూర్ కృషి ఎంతో ప్రశంశనీయం.. హ్యాపీ టీచర్ డే…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top