అమరావతి: టీడీపీ నేతలు తప్పులు చేసి బుకాయిస్తున్నారని మంత్రి సురేష్ మండిపడ్డారు. టీడీపీ హయాంలో అవినీతి విచ్చలవిడిగా జరిగిందని, కులాల ప్రసక్తి వద్దని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో రాజకీయం లేదని చెప్పారు. విద్యాశాఖలో అవినీతిపైన కూడా విచారణ జరుగుతుందని, అవినీతి ఏ రూపంలో జరిగినా సహించేదిలేదని సురేష్ హెచ్చరించారు.