జగన్‌కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ

ఢిల్లీ: సీఎం జగన్‌కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ రాసింది. విశాఖ డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారని, వైద్యుడి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు.. దేశ వ్యాప్తంగా డాక్టర్లను మనోవేదనకు గురి చేస్తోందని ఐఎంఏ పేర్కొంది. ఈ ఘటనను చూసిన వైద్యులంతా ఆందోళనకు గురవుతున్నారని, సుధాకర్ అనుచిత వ్యాఖ్యలు సమర్థనీయం కాదని ఐఎంఏ తప్పుబట్టింది. అలాంటి వ్యాఖ్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించబోమని, ఐఎంఏ నిజానిర్థారణ కమిటీ ప్రాథమిక నివేదికను జగన్‌కు ఐఎంఏ పంపింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top