శివలింగాలు ఎవరో, బోడి లింగాలు ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ‘వకీల్ సాబ్ చెప్పమన్నాడని జగన్మోహన్రెడ్డికి చెప్పమన్నాడు. ఈయన వకీల్ సాబ్నని అనుకుంటున్నాడు.. కానీ జనమేమో షకీలా సాబ్ అంటున్నారు’ అని ఎద్దేవాచేశారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో మంగళవారం ఇళ్ల స్థలాల పంపిణీ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పవన్ సోమవారం గుడివాడ, మచిలీపట్నంలో తనపైన, మరో మంత్రి పేర్ని నానిపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘భీమవరంలోనూ, గాజువాకలోనూ ప్రజలు నిన్ను బోడిలింగాన్ని చేశారు.
అయినా సిగ్గులేకుండా ప్యాకేజీ పుచ్చుకుని రాజకీయ వ్యభిచారిలా రోడ్లు పట్టుకు తిరుగుతున్నావు. చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని నువ్వొచ్చి చేతులూపి, మెడ, తొడా రుద్దితే మేం భయపడిపోవాలా? నీ డ్రామాలు, నీ యాక్షన్ సినిమాల్లో చేసుకో పైకొస్తావు.. నాలుగు డబ్బులు వస్తాయి..’ అని నాని వ్యాఖ్యానించారు.