గ‌త 24 గంట‌ల్లో మ‌హారాష్ట్ర‌ను మించి ఢిల్లీలో క‌రోనా కేసులు

కరోనా ఇప్పుడు దేశ రాజధానిని మ‌రింత‌గా క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్న తీరు చూస్తుంటే ఢిల్లీ కూడా మహారాష్ట్ర బాట‌లోనే వెళుతుంద‌న్న భ‌యం నెల‌కొంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం తాజాగా మహారాష్ట్రను మించి ఢిల్లీలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కొత్తగా 3947 కరోనా కేసులు నమోదయ్యాయి. 68 మంది మృతిచెందారు. మహారాష్ట్రలో కొత్తగా 3214 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో మొత్తం కేసులు 66,602కు పెరిగాయి. ఇప్పటివరకు 2301 మంది కరోనా కారణంగా మరణించారు. ప‌రిస్థితుల‌ను చూస్తుంటే కరోనా విషయంలో ఢిల్లీ త్వరలోనే ముంబైని అధిగమించేలా క‌నిపిస్తోంది ముంబైలో గత 24 గంటల్లో కొత్తగా 824 కరోనా కేసులు నమోదుకాగా, 42 మంది మృతి చెందారు. ముంబైలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య ప్ర‌స్తుతం 68,481గా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం 8,02,775 కరోనా పరీక్షలు జర‌గ‌గా, అందులో 1,39,010 మందికి కరోనా సోకినట్లు తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top