ఢిల్లీ: కేంద్ర హోంశాఖ కార్యదర్శి, మహారాష్ట్ర సీఎంలకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ముంబై మద్ దీవిలో చిక్కుకున్న రాష్ట్ర జాలర్లను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దాదాపు 60మంది జాలర్లు దీవిలో చిక్కుకున్నారని, వీరదరికీ ముంబైలో వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.