కేంద్రమంత్రి హర్షవర్ధన్‌కి లేఖ రాసిన రామకృష్ణ

విజయవాడ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కేంద్ర బృందం ఏపీలో పర్యటించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తెలంగాణలో 675 మరణాలు, 79 వేలు పాజిటివ్ కేసులుంటే.. ఏపీలో 2,27,000 కేసులు, 2 వేల మరణాలు సంభవించాయన్నారు. ప్రతిరోజూ 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతూ ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానానికి చేరిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top