జిల్లాలోని నాగాయలంక మండలం ఎదురుమొండిలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకే… తల్లీ, తండ్రిని దారుణంగా నరికేశాడు. ఈ ఘటనలో తల్లి తమ్మూ వీర్లంకమ్మ అక్కడికక్కడే మృతి చెందగా… తండ్రి నాగేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం అవనిగడ్డ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.