కరోనా ఎఫెక్ట్.. ఆస్ట్రేలియాలో తీవ్ర ఆర్థిక మాంద్యం!

సీడ్నీ: మహమ్మారి కరోనా వైరస్ ప్రభావంతో ఆస్ట్రేలియా గత 30 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా తీవ్ర ఆర్థిక మాంద్యంలో కురుకుపోయింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనే దేశ 1.47 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏకంగా 7 శాతం తగ్గిపోయింది. 1959లో రికార్డులు ప్రారంభమైనప్పటి నుండి ఇదే అతిపెద్ద క్షీణత అని ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా బుధవారం వెల్లడించింది. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి ఆర్థిక సంక్షోభాన్ని చూడలేదని కాన్‌బెర్రాలో మీడియాతో మాట్లాడిన ట్రెజరర్ జోష్ ఫ్రైడెన్‌బర్గ్ అన్నారు. తాజాగా వెలువడిన ఆర్థిక గణంకాలు దీనిని నిర్ధారిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

కరోనా దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోని దెబ్బ కొట్టిందని జోష్ తెలిపారు. అలాగే సెప్టెంబర్ త్రైమాసిక జీడీపీలో విక్టోరియా లాక్‌డౌన్ ఇంకా తీవ్ర ప్రభాన్ని చూపబోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఇక ప్రపంచ దేశాల్లో స్వైర విహారం చేస్తున్న మహమ్మారి ఆస్ట్రేలియాను కంగారేత్తిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 25,923 మంది కొవిడ్ బారిన పడగా… 21,690 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,570 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 663 మందిని ఈ వైరస్ పొట్టనబెట్టుకుంది.       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top