ఎమ్మెల్యే సారధిని వదిలి నాపై కేసులు పెట్టడం అన్యాయం: రాజేంద్రప్రసాద్

విజయవాడ: రెడ్‌జోన్‌ ప్రాంతమైన విజయవాడ నుంచి వచ్చి గ్రీన్‌జోన్‌ ఉయ్యూరులో తిరుగుతున్న.. ఎమ్మెల్యే సారధిని వదిలి తనపై కేసులు పెట్టడం అన్యాయమని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం సారధిని 14 రోజుల పాటు క్వారంటైన్‌కు పంపాలన్నారు. తన మీద, టీడీపీ నేతల మీద అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. 

సారధి ఇవ్వకపోతే.. పేద కుటుంబానికి రూ.20వేలు సాయం చేశామని తమపై కేసులు పెట్టారన్నారు. ఆకలితో అల్లాడుతున్న పేదలకు సాయం చేయడం నేరమా? అని రాజేంద్రప్రసాద్‌ ప్రశ్నించారు. ఎమ్మెల్యే సారధి 100 మంది కార్యకర్తలతో ఉయ్యూరులో ప్రచారం చేస్తుంటే ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. పైగా పోలీసులు  కాపలాగా సారథి వెంట తిరుగుతున్నారన్నారు. బాధ్యత గల పౌరుడిగా చట్టాన్ని, పోలీసు నిబంధనలను గౌరవిస్తానన్నారు. గ్రీన్‌జోన్‌  ఉయ్యూరులో నేను తిరిగితే తప్పా? అని ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ ప్రశ్నించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top