ఇండోర్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని స్వచ్ఛ నగరంగా పేరొందిన ఇండోర్‌లో కరోనా వైరస్‌కు హాట్ స్పాట్‌గా మారింది. ఇండోర్ నగరంలో బుధవారం ఒక్కరోజే 159 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఒక్కరోజే 159 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ జాడియా చెప్పారు. మొత్తం మీద ఒక్క ఇండోర్ జిల్లాలోనే మొత్తం కరోనా కేసుల సంఖ్య 597కు పెరిగింది. ఇతర రాష్ట్రాలకు చెందిన 11 మందికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 987 కేసులు నమోదు కాగా ఒక్క ఇండోర్ నగరంలోనే అత్యధికంగా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇండోర్ నగరంలో కరోనా కలకలం రేగింది