ఆసియా కప్‌ రద్దు

ముంబై: ఈ ఏడాది పాకిస్థాన్‌ ఆతిథ్యమివ్వనున్న ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్‌ నిర్వహణపై సందిగ్ధ్దత వీడింది. ఈ మెగా టోర్నీ రద్దయిందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ బుధవారం స్పష్టం చేశాడు. ‘సెప్టెంబరులో జరగాల్సిన ఆసియా కప్‌ రద్దయింది’ అని స్పోర్ట్స్‌ టాక్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో దాదా చెప్పాడు. రద్దు విషయాన్ని ఆతిథ్య పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) కూడా ధ్రువీకరించింది. ‘కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీ నిర్వహణ సరైంది కాదని భావించాం. అందుకే ఈ టోర్నీకి 2022లో మేం ఆతిథ్యమిచ్చేందుకు అంగీకరించాం. ఈ ఈవెంట్‌ వచ్చే ఏడు బహుశా శ్రీలంకలో జరగొచ్చు. రద్దు నిర్ణయం వెనక ఎలాంటి రాజకీయ కారణాలు లేవు. ఆతిథ్యానికి మేం కట్టుబడే ఉన్నాం. అయితే, యూఏఈ, పాకిస్థాన్‌తో పాటు దక్షిణాసియా దేశాల్లో వైరస్‌ తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో టోర్నీని రద్దు చేయక తప్పలేదు’ అని పీసీబీ చీఫ్‌ ఎహ్‌సాన్‌ మణి ప్రకటించాడు. ఆసియా కప్‌ రద్దుకు తోడు అక్టోబరు-నవంబరులో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ కూడా జరిగే అవకాశాలు లేవన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. పూర్తిస్థాయిలో ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐకి మార్గం సుగమమైనట్టే.  

ఐపీఎల్‌ లేకుండా ఏడాది ముగించం…

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. ఐపీఎల్‌ను నిర్వహించకుండా ఈ ఏడాదిని ముగించకూడదని భావిస్తున్నట్టు అంతకుముందు సౌరవ్‌ గంగూలీ చెప్పాడు. ‘ఐపీఎల్‌ లేకుండా 2020ను ముగించాలని అనుకోవడం లేదు. మెగా లీగ్‌ను దేశంలో నిర్వహించడానికి ఎదురు చూస్తున్నాం. 35 నుంచి 40 రోజుల సమయం దొరికితే చాలు లీగ్‌ను పూర్తి చేస్తాం. కానీ, ఎక్కడ అనేది మాత్రం ప్రశ్నార్థకమేన’ని ఇండియా టుడే షో ‘ఇన్‌స్పిరేషన్‌’లో దాదా చెప్పాడు. ఐపీఎల్‌ ఆతిథ్యానికి యూఏఈ, శ్రీలంక, న్యూజిలాండ్‌ ముందుకు వచ్చాయి. కానీ, అదో ప్రత్యామ్నాయమేనని గం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top