ఆమె నన్ను మార్చేసింది’

న్యూఢిల్లీ: అనుష్క శర్మ తన జీవితంలోకి ప్రవేశిం చిన తర్వాత తన ఆలోచనా ధోరణిలో ఎంతో మార్పువచ్చిందని విరాట్‌ కోహ్లీ చెప్పాడు. ‘నేనిప్పుడు ప్రతి అంశాన్ని విభిన్న కోణంలో చూడగల్గుతున్నానంటే అందుకు కారణం అనుష్క. ఆమె రాకముందు నేనెక్కువగా భావాలు వ్యక్తపరిచేవాడిని కాదు. వాస్తవంగా ఆలోచించే వాడిని కాదు. ఇలా.. చాలా విషయాల్లో నా దృక్కోణాన్ని ఆమె మార్చివేసింది. అనేక అంశాలను విశాల దృక్పథంలో చూడాలని నాకు అర్థమయ్యేలా చేసింది. ఆమెను కలుసుకోకుండా ఉండుంటే, నాలో ఈ మార్పులన్నీ ఉండేవి కాదు’ అని భార్యను కోహ్లీ పొగడ్తలతో ముంచెత్తాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top