‘ఆటో’కు అచ్చొచ్చిన ఆగస్టు

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు కుదేలైన దేశీయ వాహన రంగం క్రమం గా కోలుకుంటోంది. గత నెలలో వాహన విక్రయాలు మరింత మెరుగయ్యాయి. దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ, నెం.2 సంస్థ హ్యుండయ్‌ విక్రయాలు 20 శాతం మేర వృద్ధి చెందాయి. మిగతా కార్ల కంపెనీల విక్రయాల వృద్ధి మిశ్రమంగా ఉన్నప్పటికీ, జూలైతో పోలిస్తే మరింత పెరిగాయి. ద్విచక్ర వాహనాల గిరాకీ ఫర్వాలేదు. కాకపోతే, హీరో మోటోకార్ప్‌ మినహా అన్ని కంపెనీల అమ్మకాలు వృద్ధిని కనబర్చలేకపోయాయి. దేశవ్యాప్తంగా  వ్యవసాయం పనులు జోరుగా సాగుతుండటంతో ట్రాక్టర్లకు భారీ డిమాండ్‌ నెలకొంది. వాణిజ్య వాహనాల విభాగంలో అశోక్‌ లేలాండ్‌, వోల్వో కమర్షియల్‌ వాహర విక్రయాలు  నిరాశాజనకంగానే నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top