అదే జరిగితే.. అమెరికాపై ఇరాన్, చైనాదే పెత్తనం.. ట్రంప్ సంచలన కామెంట్స్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జో బిడెన్ అమెరికాకు అధ్యక్షుడైతే ఇరాన్, చైనా దేశాలు అమెరికాను ఆక్రమిస్తాయని ట్రంప్ అన్నారు. ఇరాన్ గురించి ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ సమాధానమిచ్చారు. ఒబామా హయాంలో అమెరికా ప్రభుత్వం ఇరాన్‌తో ఏ విధంగా స్నేహబంధం కొనసాగించిందో అందరికి తెలుసంటూ ట్రంప్ ప్రస్తావించారు. జో బిడెన్ దేశానికి అధ్యక్షుడు అయితే అమెరికన్లకు తమ దేశం మిగలదని పేర్కొన్నారు. తాను ఇరాన్‌తో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నప్పటికి, ఇరాన్ ప్రభుత్వం అమెరికాలో వేరే ప్రభుత్వం కోసం ఎదురుచూస్తోందన్నారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఓ నేతకు కూడా ప్రస్తుత అమెరికా ప్రభుత్వంతో ఇరాన్ డీల్ చేసుకోవడం ఇష్టం లేదన్నారు. ఇదే సమయంలో ఇరాన్ కూడా డీల్ కోసం వేచిచూస్తోందన్నారు. డెమొక్రట్లతో చేసుకున్న విధంగా తనతో డీల్ చేయడం కుదరదని ఇరాన్‌కు కూడా తెలుసంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. కాగా, డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జో బిడెన్ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top