అచ్చెన్నాయుడు ఇంటికి చంద్రబాబు

విజయవాడ: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడును చంద్రబాబు పరామర్శించనున్నారు. 50 రోజుల తర్వాత చంద్రబాబు ఏపీకి రావడంతో అచ్చెన్న ఇంటికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దాదాపు 80 రోజులు పాటు అచ్చెన్నాయుడు రిమాండ్‌లో ఉన్నారు. ఇటీవల ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ అయ్యారు. కరోనా పాజిటివ్ రావడంతో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో అచ్చెన్న చేరారు. పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈఎస్‌ఐ వైద్యసేవల కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడికి హైకోర్టు బెయిల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయవాడ ఏసీబీ కోర్టులో పూచీకత్తు సమర్పించి బెయిల్‌ పొందాలని ఆదేశించింది. అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని, దర్యాప్తునకు అందుబాటులో ఉండాలని కోర్టు షరతులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top