న్యూఢిల్లీ : ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన 36 రాఫెల్ విమానాల్లో మొదటి ఐదు బుధవారం అంబాలా వాయుసేన బేస్‌కు చేరుకోనున్నాయి. అయితే అంబాలాలో వాతావరణ పరిస్థితులు అంతగా బాగోలేవని సమాచారం. రాఫెల్ విమానాలు దిగే సమయంలో అంబాలాలో గనక వాతావరణం బాగోలేకపోతే… జోధ్‌పూర్‌లోని ఎయిర్ బేస్‌ను అధికారులు ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు.
Jul 29 2020 @ 07:48AM
అంబాలాకే రఫేల్స్… కుదరకపోతే… జోధ్‌పూర్

న్యూఢిల్లీ : ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన 36 రాఫెల్ విమానాల్లో మొదటి ఐదు బుధవారం అంబాలా వాయుసేన బేస్‌కు చేరుకోనున్నాయి. అయితే అంబాలాలో వాతావరణ పరిస్థితులు అంతగా బాగోలేవని సమాచారం. రాఫెల్ విమానాలు దిగే సమయంలో అంబాలాలో గనక వాతావరణం బాగోలేకపోతే… జోధ్‌పూర్‌లోని ఎయిర్ బేస్‌ను అధికారులు ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు.
అయితే అధికారులు మాత్రం దీనిని అధికారికంగా ధృవీకరించడం లేదు. ఎలాగూ అంబాలా ఏయిర్ బేస్‌లో దిగుతాయని నిశ్చయించుకున్న అధికారులు జోధ్‌పూర్‌లోని ఏయిర్ బేస్‌పై దృష్టి సారించలేదు. కానీ వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో… రఫేల్ విమానాలు దిగేందుకు వీలుగా జోధ్‌పూర్ ఏయిర్ బేస్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఫొటోలు నిషిద్ధం… 144 సెక్షన్ విధింపు
ఫ్రాన్స్ నుంచి రఫేల్ విమానాలు బుధవారం అనుకున్న దాని ప్రకారం అంబాలాకు చేరుకోనున్న విషయం తెలిసిందే. దీంతో వైమానిక స్థావరం చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వారు తెలిపారు. అంబాలా ఎయిర్ బేస్ సమీపంలో ఉన్న 4 గ్రామాల్లో కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. విమానాలు ల్యాండయ్యే సమయంలో.. రన్‌వేకు సమీపంలోని ఇళ్లపై ప్రజలు గుమిగూడటం, ఫోటోలు తీయడంపై కూడా నిషేధం విధించామని అంబాలా డీఎస్పీ తెలిపారు.